ఎమ్యెల్యే నిరాహార దీక్ష కొనసాగింపు
హైదరాబాద్: తనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ తెలుగుదేశం కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నిన్న చేపట్టిన నిరశన దీక్ష మంగళవారం కూడా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన నీరసించి పోయారు.
గత కొంత కాలంగా రామారావు షుగరు వ్యాధితో బాధపడుతున్నారని, అక్రమ కేసుల వేధింపులతో మానసికంగా ఆయన కుంగిపోయారని బంధువులు అంటున్నారు. కళాశాలలో ఒక విద్యార్థిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని టీవీ రామారావుపై కేసు నమోదైంది. తనపై వేధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications