అగ్నిప్రమాదంలో 17 మంది మృతి
మధురై: తమిళనాడులో మధురై జిల్లాలో బుధవారం ఉదయం ఒక బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం చెలరేగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 40 మంది దాకా గాయపడ్డారు. వడకంపట్టిలోని ఈ బాణా సంచా కర్మాగారానికి లైసెన్సు ఉంది. ఇది మధురైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. గాయపడినవారిలో కొంత మంది విద్యార్థులు. వీరు చదువు ముగిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి ఎంకె అళగిరి సందర్శించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications