ముంబయి: పనిమనిషిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజాకు కోర్టులో చుక్కెదురైంది. అహుజా తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో అహుజా ఈ నెల 16వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సి వస్తుంది.
బెయిల్ పై విడుదలైతే అహుజా పని మనిషిపై ప్రభావం వేయవచ్చునని అంటూ పోలీసులు బెయిల్ మంజూరు చేయకూడదని కోరారు. ఆమె సమ్మతి మేరకే తాను పని మనిషితో సెక్స్ లో పాల్గొన్నానని అహుజా చెప్పాడు.