ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ సమీపంలో గల కొత్తపేటలో గురువారం ఓ భవనంపై నుంచి ఇంజినీరింగ్ విద్యార్థిని దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని భోజిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్వినిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కులు తక్కువ వచ్చాయనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications