హైదరాబాద్: నక్సలైట్లుగా గతంలో పనిచేసి ఇప్పుడు మంత్రులైన వారు ఎవరో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుసునని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఇంటిలెజెన్స్ చీఫ్ అరవిందరావుకూ ఈ వివరాలు తెలసన్నారు. ఆ మంత్రులెవరో సీఎం చెబితేనే బావుంటుందన్నారు. ఈ మంత్రలు పేర్లను సీఎం చెప్పకపోతే అప్పుడు తాను వెళ్ళడిస్తానన్నారు. కేబెనెట్ లో నక్సలైట్లు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం లేవగా ఆయనని కలిసిన ఓ టీవీ ఛానెల్ తో ఈ విధంగా సమాధానమిచ్చారు. అయితే గతంలో నక్సల్ ఉద్యమంలో ఉండి ఆ తర్వాత జన జీవన స్రవంతిలో కలసి ఎన్నికల్లో గెలిచి మంత్రులు కావడాన్ని మాత్రం తాను తప్పు పట్టడం లేదన్నారు.