హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆర్థిక మంత్రి రోశయ్య తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాడ పగలగొడుతానని బాబు వ్యాఖ్యనించడంపై రోశయ్య స్పందించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబుకు పవర్ ప్లూ సోకిందని ఎద్దేవా చేశారు. బాబు నోటికి అడ్డు అదుపు లేదని, గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలని ఆయన సూచించారు.