న్యూఢిల్లీ: మన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. రాష్ట్రంలో వర్షాలు సరిగా పడని నేపథ్యంలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా లోపాలు తదితర విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఆయన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోనున్నారు. రెండు రోజుల పాటు వైఎస్ ఢిల్లీలో ఉంటారు.