వైయస్,బాబు పోటీ వ్యూహాలు

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: మంత్రులతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం ఉదయం భేటీ అయ్యారు. రేపటి నుంచి (శుక్రవారం నుంచి) శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. శాసనసభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మంత్రులతో చర్చించారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, గోదావరినదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు తదితర అంశాలను లేవనెత్తి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్సలను తిప్పికొట్టేందుకు మంత్రులు, శాసనసభ్యులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉంటే, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు శుక్రవారం పాదయాత్ర చేస్తూ శాసనసభకు చేరుకుంటారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వారు ఎన్టీఆర్ ఘాట్ నుంచి శాసనసభ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెంపు, గోదావరి, కృష్ణా జలాలపై ప్రభుత్వ తీరులను నిరసిస్తూ వారు ఈ పాదయాత్ర చేస్తారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి కె.రోశయ్య శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+