రాములమ్మపై కెసిఆర్ కు రవీంద్ర లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుకు ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్ర నాయక్ మరో లేఖాస్త్రాన్ని సంధించారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలవడాన్ని తప్పు పడుతూ ఆయన శనివారం ఈ లేఖ రాశారు. మీ అనుమతితోనే విజయశాంతి ముఖ్యమంత్రిని కలిశారా అని ఆయన ప్రశ్నించారు.
విజయశాంతి అసలు రూపం ఇప్పటికైనా తెలిసిందా అని ఆయన కెసిఆర్ ను అడిగారు. ఉద్యమాలతో సంబంధం లేనివారికి టికెట్లు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర కమిటీ ని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. విజయశాంతి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications