ఎన్నో తప్పులు చేసా..వైయస్

హైదరాబాద్‌ : అసెంబ్లీ లోపలా,బయటా తప్పులు చేశాను.ఆ అనుభవంతోనే చెబుతున్నాను అంటూ ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మావలోకనం చేసుకున్నారు. 'ఈ రోజు నేనింత మంచిగా మాట్లాడగలుగుతున్నానంటే... అందుకు కారణం అనుభవం. నేను చాలా చాలా పొరపాట్లు చేశాను. ప్రజలతో సత్సంబంధాలు పెరగాలంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి. వినయం, సంయమనం, మాట తీరులో నెమ్మదితనంతో పాటు.. ప్రజల కష్టసుఖాల్లో మమేకం కావాలి'... అంటూ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పాఠాలు చెప్పారు.

తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభా వ్యవహారాలపై అవగాహన కోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన సదస్సును శనివారం వైఎస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రజల మాటలు వినని ప్రభుత్వాలు కాలగర్భంలో కలసిపోతాయి. ప్రజలతో మమేకమైపోయి విశ్వసనీయతను చూరగొనాలి. ప్రజలకు కావలసిన మేళ్లను మరింత ఎక్కువగా చేస్తూ వారికి మరింత చేరువ కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి'' అని వైఎస్‌ సూచించారు.

ప్రపంచంలో రాజరికాలు, నియంతృత్వ ప్రభుత్వాలు, కమ్యూనిజం వంటి ఎన్నో పరిపాలనలు సాగినా... ప్రజాస్వామ్యమే నాలుగు కాలాలపాటు నిలబడగలిగిందనిఅన్నారు. "ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రతి ఒక్కరి గొంతూ వినడానికి ప్రయత్నిస్తా యి. ప్రజల కష్ట సుఖాలను మాటల ద్వారానే తెలుసుకోగలుగుతాం'' అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+