విద్యార్థినిపై దాడి: ప్రేమోన్మాది అరెస్టు
హైదరాబాద్: ఎంబిఎ విద్యార్థిని రూపాదేవిపై దాడి చేసిన ప్రేమోన్మాది కె భానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ప్రేమించడం లేదనే కోపంతో భాను రంగారెడ్డి జిల్లా మేడ్చేల్ లో గల ధృవ కళాశాల విద్యార్థిని రూపాదేవిపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో రూపాదేవికి 11 గాయాలయ్యాయి. హైదరాబాదులోని బషీరాబాద్ లో గల బాలాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రూపాదేవి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆమె తల్లిదండ్రులు యానాం నుంచి హైదరాబాదుకు వస్తున్నారు. భానును పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
పాండిచ్చేరి యానాంకు చెందిన వి.రూపాదేవి(21) ధ్రువ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటోంది. అక్కడే చదువుకున్న సీనియర్ విద్యార్థి కె.భాను(24) ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తనని కలవాలంటూ ఆమెకు ఫోన్ చేశాడు. విద్యార్థిని హాస్టల్ బయటికి వచ్చిన తర్వాత తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. తనకు పెళ్లి నిశ్చయమైందంటూ రూపాదేవి నిరాకరించింది. పలుమార్లు ఒత్తిడి చేసినా వినకపోవడంతో వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో ఆమె మెడపై కోశాడు.దాడిని వారించడానికి చేసిన ప్రయత్నంలో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. రూపాదేవితో పాటు గాయపడ్డ మిగతా ముగ్గురినీ వెంటనే పేట్‌బషీరాబాద్‌లోని బాలాజీ హాస్పిటల్‌కు తరలించారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications