రాములమ్మపై తెరాస మల్లగుల్లాలు

తన వ్యవహారం పార్టీని కలవరపెడుతున్నప్పటికీ విజయశాంతి మాత్రం పార్టీపై గానీ, పార్టీ నేత చంద్రశేఖరరావుపై గానీ ఒక్క మాట కూడా జారడం లేదు. తాను ఏం చేయబోతున్నాననే విషయంపై ఆమె సూచనమాత్రంగా కూడా ఏమీ చెప్పడం లేదు. అయితే గతంలో తెరాసలో పని చేసి, వెళ్లిపోయిన తూర్పు జయప్రకాష్ రెడ్డివంటి నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. నరేంద్ర కూడా ఆమెతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆమె మాత్రం కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, మరో అసమ్మతి నెత కెకె మహేందర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications