ఢిల్లీలో వైయస్ బిజీ బిజీ

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఆయన సోమవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రధాని ఇచ్చిన అల్పాహార విందుకు హాజరై అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర నిధులు కావాలని ఆయన ప్రధానిని కోరినట్లు సమాచారం. అలాగే, పోలవరం తదితర ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై ఆయన ప్రధానికి వివరించారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరవు పరిస్థితితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఆమెకు వివరించినట్లు చెబుతున్నారు. అంతకు ముందు ఆయన ప్రధాని అంతర్గత భద్రతపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+