వరంగల్: వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎపి ఎస్పీ 4వ బెటాలియన్ ట్రైనీ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇటీవలే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గత అర్థరాత్రి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అతని మిత్రులు తెలిపారు. సతీష్ అనే ఆ ట్రైనీ కానిస్టేబుల్ ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపురానికి చెందినవాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.