మాకేం అభ్యంతరం లేదు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఎన్ని ప్రశ్నలకైనా తాము సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని, సభా సమయమంతా ఒక ప్రశ్నకే పరిమితం చేద్దామన్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం శాసనసభలో దుమారం చెలరేగింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఆ విధంగా అన్నారు. అన్ని పక్షాలు అంగీకరిస్తే సభలో ఒక ప్రశ్నతోనే గడుపుదామని ఆయన అన్నారు.

అనుబంధ ప్రశ్నలు వేయడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. మనం కొన్ని పరిమితులు పెట్టుకోవాలని, లేదంటే స్పీకర్ చెప్పినట్లు విని సభను సజావుగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. సభ్యులు కోరినంత సమయం ఇవ్వాలని ఆయన స్పీకర్ ను కోరారు. ప్రశ్నలు అడగడానికి ఎంత సమయం ఇస్తున్నారో సమాధానం చెప్పడానికి కూడా అంతే సమయం ఇవ్వాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+