రోశయ్య వ్యాఖ్యలపై దుమారం

విటిపిఎస్ నిర్మాణంలో జాప్యంపై దేవినేని ఉమామహేశ్వరరావు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. అర్హత లేని కాంట్రాక్టరుకు పనులు అప్పగించడం వల్లనే పనులు పూర్తి కావడంలేదని, ఇందులో అవినీతి చోటు చేసుకుందని ఆయన విమర్శించారు. రైతులకు జూన్ 1వ తేదీ నుంచి 9 గంటల విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని, ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి కూడా మోసం చేస్తోందని తెలుగుదేశం సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శించారు.
వారి విమర్శలకు మంత్రి రోశయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము రాజకీయ ఉపన్యాసాలు చేయదలుచుకుంటే తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక హామీలపై కూడా మాట్లాడగలమని అంటూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర వాగ్వివాదం చెలరేగి సభ వాయిదాకు దారి తీసింది.












Click it and Unblock the Notifications