హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు హాజరు కాని మంత్రులపై, శాసనసభ్యులపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాని సభ్యుల వివరాలు ఇవ్వాలని ఆయన చీఫ్ విప్ భట్టి మల్లు విక్రమార్కను ఆయన ఆదేశించారు.
బుధవారం సాయంత్రం సభలో హాజరు శాతం తక్కువ ఉండడంపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. బుధవారం సెషన్ కు దాదాపు 70 మంది కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు పలువురు మంత్రులు గైర్హాజయ్యారు.