న్యూఢిల్లీ: జిన్నాపై తాను రాసిన పుస్తకాన్ని గుజరాత్ ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ బిజెపి బహిష్కృత నేత జస్వంత్ సింగ్ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సర్దార్ పటేల్ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని ఆరోపిస్తూ గుజరాత్ ప్రభుత్వం జస్వంత్ సింగ్ రాసిన జిన్నా- ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్ పుస్తకాన్ని నిషేధించింది.
సటానిక్ వర్సెస్ రాసిన సల్మాన్ రష్దీకి దక్కిన గౌరవమే తనకు తనకు దక్కిందని నిషేధంపై జస్వంత్ సింగ్ ఇంతకు ముందు వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని నిషేధించడం ఆలోచనను నిషేధించడమేనని ఆయన అన్నారు.