వైయస్ క్షేమం: ప్రఫుల్ ధృవీకరణ

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో పాటు చీఫ్ భద్రతాధికారి వెస్లీ, మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి హైదరాబాదుకు బయలుదేరుతున్నారు. రోడ్డు మార్గంలో చిత్తూరుకు చేరుకుంటారని కూడా ఒక అధికారి అంటున్నారు. హెలికాప్టర్ దిగిన ప్రదేశం నుంచి ముఖ్యమంత్రి కొంత దూరం కాలినడకన ప్రయాణించి ఒక గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారనే వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications