తిరుపతి: తిరుపతిలో బుధవారం ఉదయం జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మరణించిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన భక్తుడిగా గుర్తించారు యాత్రా సదన్ - 3 వద్ద కరెంటు తీగ తెగి మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. భక్తులు ఆరుబయట పడుకున్నారు. ఈ సమయంలో కరెంటు తీగ తెగిపడింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
సమాచారం తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కృష్ణారావు, దర్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. వెంటనే నివేదిక సమర్పించాలని కూడా వారు ఆదేశించారు.