సిఎం రేసులో లేను: జానా

Jana Reddy
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తాను పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి జైపాల్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, రాష్ట్ర మంత్రివర్గంలో అప్పుడే లుకలుకలు ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోనని వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి అంటున్నారు. వైయస్ మృతితో కలత చెందడం వల్లనే తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. తానింకా వైయస్ మృతి షాక్ నుంచి తేరుకోలేదని అంటున్నారు. పి. రామచంద్రారెడ్డి కూడా ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుంటే, మంత్రులు వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్ర రావు ఇంట్లో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+