జగన్ బాటలో నడుద్దాం: కెవిపి

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం మినహా పార్టీ అధిష్ఠానవర్గానికి మరో ఆలోచన ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. వైయస్ కు మీ జేజేలు అక్కర్లేదని, ఆయన మనందరి వెంటా ఉంటాడని కెవిపి అన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వైయస్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన కోరారు. వైయస్ ఆత్మకు శాంతి చేకూరడమే తనకు కావాల్సిందని ఆయన అన్నారు. తమ ఇద్దరి ఆత్మలు ఒక్కటేనని ఆయన అన్నారు. వైయస్ పాదసవ్వడిలో తన జీవితం సాగిందని ఆయన చెప్పుకున్నారు. తాను వైయస్ ఆత్మకు శాంతినే కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కంట తడి పెట్టారు.












Click it and Unblock the Notifications