కొలిక్కి రాని జెట్ పైలట్ల సమ్మె

రెండు అంతర్జాతీయ విమానాలను మాత్రమే నడుపుతామని యాజమాన్యం శనివారం ఉదయం ప్రకటించింది. లండన్ - ముంబై, అబూ దుబాయ్ - ఢిల్లీ విమానాలు మాత్రమే నడుస్తాయని చెప్పింది. శుక్రవారం 240 విమానాలు ఆగిపోయాయి. 500 మందికి పైగా పైలట్లు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. యాజమాన్యానికి, పైలట్లకు మధ్య ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన చర్చలు కొలిక్కి రాలేదు. రెండో విడత చర్చలు శనివారం ముంబైలో జరుగుతాయి. ఉద్వాసనకు గురైన నలుగురు పైలట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications