మహారాష్ట్రలో 3గురు ఆంధ్రుల కాల్చివేత

Maharashtra
వరంగల్: మహారాష్ట్ర అడవుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్మగ్లరను మహారాష్ట్ర అధికారులను కాల్చి చంపినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. మృతులు వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందినవారని తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కొంత మంది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవులకు వెళ్లినట్లు సమాచారం. వారు కలపను తీసుకుని వస్తుండగా మహారాష్ట్ర అటవీ శాఖాధికారులు అడ్డుకున్నారని, ఈ సమయంలో వాగ్వివాదం జరిగిందని, మహారాష్ట్ర అధికారులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారని తెలుస్తోంది. సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి వరంగల్ జిల్లా అటవీ అధికారులు సంఘటనా స్థలానికి బయలుదేరారు.

మహారాష్ట్ర అడవుల్లో చాలా కాలంగా కలప స్మగ్లింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అది ఆగడం లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖాధికారులకు ఆయుధాలు సమకూర్చినట్లు చెబుతున్నారు. కలప స్మగ్లర్లు గోదావరి నదిలో దూకి పారిపోవడానికి కూడా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+