సమాచారం ఇచ్చేందుకే ఢిల్లీకి: కెవిపి

ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన వైయస్ జగన్ తో మాట్లాడారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చివరి ప్రయత్నం చేయడానికే ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోసారి అధిష్ఠాన వర్గానికి చెందిన నాయకులను కలిసి తన వాదనను వినిపించే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో జగన్ ను నాయకుడిగా ఎన్నుకోవడానికి కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరుగుతుందని భావించారు. అయితే అది జరగకపోవడం, నాయకుడి ఎంపికలో అధిష్ఠానం తొందరేమిటనే పద్ధతిలో వ్యవహరిస్తుండడం జగన్ వర్గీయులను ఆందోళనకు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications