తగ్గకుంటే చేటు తప్పదు: కెవిపి

KVP Ramachandar Rao
హైదరాబాద్: అతిగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మంత్రులకు సూచించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన వైయస్ సంతాప సభలో పాల్గొన్న అనంతరం ఆయన లైక్ వ్యూ అతిథిగృహంలో మంత్రులతో సమావేశమయ్యారు. రవీంద్రభారతిలోనే సమాచారం అందించడంతో మంత్రులంతా నేరుగా అక్కడికి చేరుకున్నారు. వైయస్ కుటుంబంపై అధిష్టానవర్గానికి వైయస్ కుటుంబ సభ్యులపై అపారమైన గౌరవం ఉందని, పరిస్థితి అంతా అధిష్ఠానవర్గం అర్థం చేసుకుందని ఆయన చెప్పారు. నాయకత్వ విషయమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఈలోగా సానుకూల వాతావరణాన్ని దెబ్బ తీసే చర్యలకు ఎవరూ పాల్పవడద్దని ఆయన మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామాలు చేస్తామని వంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆయన సూచించినట్లు సమాచారం. మేలు చేస్తున్నామనుకుని చేసే వ్యాఖ్యల వల్ల చేటు సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని శాసనసభ్యులే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇక్కడ చేసే వ్యాఖ్యలు ఢిల్లీకి చేరి ఇప్పటికే చాలా నష్టం జరిగిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. నష్ట నివారణకు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సమావేశం తర్వాత మీడియాతో మంత్రులెవరూ కూడా మాట్లాడలేదు. వారు మాట్లాడేందుకు నిరాకరించారు. ఢిల్లీలో పరిణామాలను తాను సహచరులకు అందించానని, ఇక్కడి పరిస్థితిని వారు తనకు వివరించారని కెవిపి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+