అక్రమ భూ వివాదంలో విజయశాంతి

Vijayashanthi
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి భూ వివాదంలో ఇరుక్కున్నారు. విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఖాతాలోకి కోట్ల రూపాయలు మళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని ఎద్దుమైలారంలోని అర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సొమ్మంతా ఆ ఖాతాలోకి మళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెసు నేతల సహకారంతో విజయశాంతి ఈ అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే - 2004లో హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. ఇందులో 1400 మంది సభ్యులు చేరారు. ావరు 1200 రూపాయలేసి చెల్లించారు. వారికి అమీర్ పూర్ వద్ద 140 ఎకరాల స్థలం చూపించారు. అయితే అది రింగ్ రోడ్డులో పోయింది. ఈ సమయంలో దాదాపు 2 కోట్ల రూపాయలు సొసైటీ ఖాతా నుంచి నరేష్ అగర్వాల్ కు చెందిన పంజాబ్ ఖాతాలోకి మళ్లింది. అక్కడి నుంచి కోటీ 80 లక్షల రూపాయలు విజయశాంతి భర్తగా చెబుతున్న శ్రీనివాస ప్రసాద్ ఖాతాలోకి వెళ్లాయి. శ్రీనివాస ప్రసాద్ ఖాతాలోకి రెండున్నర కోట్ల రూపాయలు మళ్లాయి. దీంతో వివాదం మొదలైంది. ఈ వివాదంతో 600 మంది సభ్యులకు తిరిగి సొమ్ము చెల్లించారు. కాంగ్రెసు శాసనసభ్యుల సహకారంతో విజయశాంతి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుగుదేశం సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+