నాకు అప్పగిస్తే నరికేస్తా: అనూష

నిందితుడిని ఉరి తీయాలని ఆమె అన్నది. లేకుంటే విద్యార్థులకు అప్పగిస్తే అతడి సంగతి వారే చూసుకుంటారని, అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని అనూష అంటోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ అనే ప్రేమోన్మాది అనూషపై దాడి చేసి ఆమె తల్లిదండ్రులను హత్య చేసిన సంఘటన రాజమండ్రిలో తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళా సంఘాలు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి సంఘటనల్లో నిందితులకు సరైన శిక్షలు పడకపోవడం వల్లనే అవి పునరావృతమవుతున్నాయని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications