రాజమండ్రి: అనూష అనే విద్యార్థిపై దాడి చేసి, ఆమె తల్లిదండ్రులను హతమార్చిన ప్రేమోన్మాది రాజేష్ కు కోర్టు శనివారం అక్టోబర్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రాజేష్ ను పోలీసులు శనివారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల కార్యకర్తలు రాజేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై జాగ్రత్తగా కోర్టులోపలికి రాజేష్ ను తీసికెళ్లారు.
రాజేష్ దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో శనివారం మహిళలు ప్రదర్శన నిర్వహించారు. రాజేష్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాజేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.