మాపై కుట్ర చేస్తున్నారు: చిరు

జగన్ ముఖ్యమంత్రి కావాలని తమ పార్టీలోని శాసనభ్యులు కొంత మంది అనడం కొత్తేమీ కాదని, గతంలో కొంత మంది శాసనసభ్యులు ఆ అభిప్రాయం వక్తం చేశారని, అప్పుడు అది వారి వ్యక్తిగతాభిప్రాయమని చెప్పానని, ఇది కొత్త వార్తేమీ కాదని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు విషయం కాంగ్రెసు అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. రోశయ్యను తిరుపతికి ఆహ్వానించడం తన బాధ్యత అని, తాను అదే పని చేశానని ఆయన చెప్పారు.
తిరుపతి నియోజక వర్గంలో కొన్ని సమస్యలున్నాయని, ఆ సమస్యలతో తాను రోశయ్యకు వినతిపత్రం సమర్పించానని, పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం సరి కాదని, అందువల్ల తాను రోశయ్య విషయంలో అలా వ్యవహరించానని, అది తన కర్తవ్యం కూడా అని ఆయన అన్నారు. దానిపై చిలువలు పలువలు సృష్టించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉద్వేగ భరితమైన పరిస్థితి ఏదీ లేదని, ఎవరో కావాలని తమ పార్టీ విషయంలో కుట్ర చేస్తున్నారని, ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తనకు కూడా తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications