హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్యను కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానవర్గం అందుకోసం ఎటువంటి అవాంతరాలు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడితే దానిపై సమర్ధంగా కేంద్రానికి నివేదికలు పంపగల గవర్నర్ ను నియమించాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వర్గం రోశయ్యను ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు హైకమాండ్ కు చేరవేయగల గవర్నర్ కోసం అన్వేషణ సాగుతోంది. వయోభారం మీద పడిన ప్రస్తుత గవర్నర్ ఎన్ డి తివారీతో అది అయ్యే పని కాదని సోనిమా, మన్మోహన్ లు ఇప్పటికే గుర్తించారు.