మల్లన్న కోసం కర్రల సాము

Kurnool
కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామి దేవుడి విగ్రహం కోసం సోమవారం రాత్రి కర్రల సాము సాగించారు. ఈ సాములో యాభై మంది దాకా గాయపడ్డారు. దేవుడి విగ్రహాన్ని దక్కించుకునేందుకు వివిధ గ్రామాల ప్రజలు కర్రలతో పోరాడుతారు. తలలు బద్దలు కొట్టుకుంటారు. ఇది ఏటా జరిగే ఆచారం. ఈ ఆచారాన్ని ఆపడానికి నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం దక్కడం లేదు. దసరా పండుగ సందర్భంగా జరిగిన కర్రల యుద్ధంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 33 గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొన్నాయి. అయితే ఇతర గ్రామాల ప్రజలను తిప్పికొట్టి దేవరగట్టు ప్రజలు తమ దేవుడ్ని కాపాడుకోగలిగారు.

ఈ కర్రల సాములో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్నాటక నుంచి కూడా లక్ష మంది దాకా తరలివచ్చారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు దీన్ని అపడానికి ప్రయత్నించారు. దీని వల్ల గతంలో కన్నా ఈసారి కాస్తా హింస తగ్గింది. గతంలో వందలాది మంది ఈ పోరులో గాయపడేవారు. ఈసారి పదుల సంఖ్యలో మాత్రమే గాయపడడం కొంత ఊరట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+