గాంధీ జయంతికి సెలవు వద్దు: మంత్రి

మహాత్మా గాంధీ తన జయంతి రోజున ప్రజలు కష్టించి పనిచేయాలని కోరుకునేవారని. ఆయన అభీష్టానికి విరుద్ధంగా ఆరోజును సెలవు దినంగా ప్రకటించి ప్రజలను బద్దకస్తులను చేస్తున్నారని మైక్రో బ్లాగింగ్ నెట్ వర్క్ ట్విట్టర్ లో శశి ధరూర్ ఒక మెసేజ్ ని పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజకీయ నాయకుడై ఉండి కూడా లౌక్యం లేకుండా ముక్కుసూటిగా అభిప్రాయం వ్యక్తం చేసిన ధరూర్ శుక్రవారమంతా 24 గంటల న్యూస్ చానల్స్ కు ప్రధాన ఆకర్షణగా మారారు.
గాంధీజీ "వర్క్ ఈజ్ వర్షిప్" అని చెబుతుండేవారని, మనం ఆయన చెప్పినదానికి విరుద్ధంగా ఆయన జయంతి నాడు సెలవు తీసుకుంటున్నామని ధరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. "వియత్నాంలో హోషిమిన్ జయంతికి సెలవు ఉండదు. ఆ రోజు పౌరులు మరింత కష్టపడాలి" అని వియత్నాం ఉపాధ్యక్షుడు నిన్న చేసిన ప్రకటనను శశి ధరూర్ ఉటంకించారు. శశిధరూర్ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు. అసలే ఆర్ధిక మాద్యంతో దేశం తల్లడిల్లుతుంటే అధిక సెలవులు ఉత్పాదకతను మరింత కుంగదీస్తున్నాయి.












Click it and Unblock the Notifications