రోశయ్యవి సమర్థ చర్యలే, కానీ..: చిరు

Chiranjeevi
హైదరాబాద్: వరద సహాయక చర్యల విషయంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య సమర్థంగానే పనిచేస్తున్నా కింది స్థాయిలో సహకారం అందడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు. ఆయన గురువారంనాడు మహబూబ్ నగర్ జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. రంగాపూర్ లో పార్టీ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వరద సహాయక చర్యల్లో కింది స్థాయి అధికారులు సహకరించడం లేదని ఆయన అన్నారు.

వరద సహాయక చర్యలు తీసుకునే విషయంలో రోశయ్య కఠినంగా వ్యవహరించారని ఆయన అన్నారు. అధికారులు సహాయక చర్యలపై సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేని స్థితిలో ఉందని, అధికార యంత్రాంగంపై తాము ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వరదపై చర్చించేందుకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+