జగన్ కంపెనీలకు ఐటి నోటీసులు

ఆ సంస్థలకు పెట్టుబడులను ఏ విధంగా సమీకరించారు, రాబడి మార్గాలేమిటి వంటి వివరాలను స్వయంగా తమ కార్యాలయానికి వచ్చి వివరించాలని ఐటి అధికారులు ఆ కంపెనీలకు సమన్లు జారీ చేసినట్లు ఆ పత్రిక రాసింది. రెండు నెలలుగా ఆ కంపనీలకు సంబంధించిన వివరాలపై కసరత్తు జరిపి ఐటి శాఖ గత వారం ఆ నోటీసులు జారీ చేసినట్లు ఆ వార్తాకథనం వ్యాఖ్య. వైయస్ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు గతంలో చేసిన విమర్శలను పత్రిక గుర్తు చేసింది.
ఐటి నోటీసులు అందుకున్నవారంతా హేమీహేమీలేనని ఆ పత్రిక చెప్పింది. ల్యాంకో, పెన్నా, హెటరో డ్రగ్స్, రాంకీ గ్రూప్, అరబిందో ఫార్మా వంటి పలు సంస్థల ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులు, వారికి చెందిన కంపెనీలతో పాటు దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, ఇతర రాష్ట్రాల కంపెనీలు నోటీసులు అందుకున్నట్లు ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications