వరంగల్ :త్వరలోనే నక్సల్స్ ని పూర్తి స్ధాయిలో అణిచివేస్తామని రాష్ట్ర డీజీపీ గిరీష్‌కుమార్ హామీ ఇచ్చారు. అలాగే నక్సల్స్ అణిచివేతకు ప్రత్యేకంగా పక్కా ప్రణాళికలు రచిస్తామని అన్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి వరంగల్ రేంజ్ పరిధిలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించేందుకు వరంగల్ చేరుకున్నారు. తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమస్యలు, వారి ఇబ్బందులు పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. నగరంలో కమిషనరేట్ ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు.