హైదరాబాద్: వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే తమ అభీష్టం కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం వద్ద పరిశీలనలో ఉందని, అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారంనాడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలో కలుసుకున్నారు. సోనియా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే అంశంపై పరిశీలిస్తున్నారని, సోనియా ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరుగుతుందని జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాంగ్రెసు పార్టీలో ఏలాంటి గ్రూపులూ లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ మీడియా సృష్టేనని ఆన అన్నారు. పార్టీలో అందరూ ఏకతాటిపై ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.