చంద్రబాబుతో హరికృష్ణ భేటీ

Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆయన బావ మరిది నందమూరి హరికృష్ణ మంగళవారం కలిశారు. వారిద్దరి మధ్య రాష్ట్రంలోని వరద పరిస్థితిపై చర్చ జరిగింది. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై కూడా వారు చర్చించారు. వారిద్దరి భేటీ జరగడం చాలా కాలం తర్వాత జరిగింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

వరద బాధితుల సహాయం కార్యక్రమాలపై చంద్రబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేసిన సహాయం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. తాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి బాధితులకు అందిస్తున్నామని, చాలా మంది అందుకు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, వారి ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చిందని, డబ్బు సంపాదించడమే కాకుండా దాన్ని బాధల్లో ఉన్నవారికి ఉపయోగించాలనే ఆలోచన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+