పాట్నా: సాయుధ మావోయిస్టులు బీహార్ లోని బన్సీపూర్ రైల్వే స్టేషన్ పై దాడి చేశారు. తూర్పు మధ్య రైల్వేలకు చెందిన ఆ స్టేషన్ పై దాడి చేసి కేబిన్ రూమ్ ను దగ్ధం చేశారు. ఈ సంఘటన బీహార్ లోని లాఖిసరాయ్ జిల్లాల సోమవారం అర్థరాత్రి జరిగింది. దాదాపు వంద మంది సాయుధ నక్సలైట్లు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాడి తర్వాత స్టేషన్ మాస్టర్ జాడ తెలియడం లేదు. దాంతో స్టేషన్ మాస్టర్ ను వారు కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
దాడి తర్వాత నక్సలైట్లు పారిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.