'రోశయ్య పదవిపై తాడో పేడో తేలాల్సిందే'

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రోశయ్యకు తగినంతమంది శాసనసభ్యుల మద్దతు ఉందా, లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొందని, దానిని తేల్చాల్సిందిగా తాము కోర్టును అభ్యర్థించామని సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు తెలిపారు.

ఏ రాజ్యాంగ సూత్రాల ప్రకారం రోశయ్య ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారో తెలియజేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ నేత బెజవాడ గోవిందరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగిందని చెప్పారు. ఆ అంశాలను వివరించడానికి ఆయన తన నివాసంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

వైఎస్‌ జగన్‌పై తమకు విశ్వాసం ఉందని 150 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా తెలిపారని, రోశయ్యతోపాటు పదిమంది మంత్రులు బహిరంగంగా మద్దతు పలికారని, ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్‌ల సీడీలను కోర్టుకు సమర్పించామని ఆయన వివరించారు. వాటిని వివరించడానికి తగిన సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరామన్నారు.

పార్టీలు, వ్యక్తులతో సంబంధం లేకుండా జటిలమైన రాజ్యాంగ విషయాన్ని కోర్టుకు విన్నవించామని, శాసనసభ్యుల మద్దతు లేకుండా సీఎంగా కొనసాగవచ్చా లేదా అనేదే ఇక్కడ ప్రధానమని అన్నారు. మద్దతు లేని వ్యక్తి తీసుకున్న నిర్ణయాల చెల్లుబాటుపైనా తమకు సందేహాలు ఉన్నాయన్నారు. సీఎం పదవిలో ఉన్నవారికి సీఎల్‌పీ మద్దతు లేకపోతే అది చట్టవ్యతిరేక ప్రభుత్వం అవుతుందన్నారు.

ముఖ్యమంత్రిగా నియమితులైన రోశయ్య నిర్ధారిత గడువులోగా సభా విశ్వాసాన్ని పొందాలని, ఆ ప్రక్రియ ఇంతవరకు జరగలేదని అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ గురువారం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పిటిషనర్‌ కూడా పాల్గొన్నారు. అయితే, కోర్టు పరిధిలో ఉన్న కేసులపై ఇలా మీడియాలో మాట్లాడడం సబబు కాదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+