తిరుమలలో సెల్లార్ దర్శనాలు రద్దు

శ్రీవారి శీఘ్ర దర్శనానికి కూడా పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. శీఘ్ర దర్శనం చేయాలనుకునే వారి కోసం ఒకటో నెంబర్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారం వద్ద టిటిడి కౌంటర్ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ లో మూడు వందల రూపాయలతో టిక్కెట్ కొన్నవారు ఆలయం మహా ద్వారం వరకూ ఎలాంటి ఆటంకమూ లేకుండా వెళ్ళవచ్చు.
విఐపి దర్శనాలను నియంత్రించడంలో భాగంగా మంగళవారం నుంచి ఎఎడి, సెల్లార్ దర్శనాలను టిటిడి పాలకమండలి రద్దు చేసింది. శీఘ్ర దర్శనం టిక్కెట్ కొన్న వారికి త్వరగా అతి తక్కువ సమయంలోనే స్వామి దర్శనం చేసుకొనే వీలుంటుంది. అలాగే శీఘ్ర దర్శనం చేసుకున్నవారు దర్శనానంతరం తిరుమల కొండపై ఉండాలనుకుంటే శీఘ్ర దర్శనం టిక్కెట్ చూపిస్తే వసతి కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు.












Click it and Unblock the Notifications