న్యూఢిల్లీలో సోనియా గాంధీతో రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు

నేతను ఎన్నుకునేందుకు తప్పకుండా సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి కె. రోశయ్య ఆదివారం సాయంత్రం ఢిల్లీలో చెప్పారు. అయితే తేదీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. మంత్రివర్గ వునర్వ్యస్థీకరణకు ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిస్తారా అడిగితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకా ఎలాంటి ఫార్ములా రూపొందించలేదని, దీనిపై ఇంతవరకు అధిష్టానం స్థాయిలో చర్చలు జరగలేదని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 28వ తేదీన సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్ తల వంచినట్లు కనిపిస్తున్నప్పటికీ అసమ్మతి రాజకీయాలకు ఆజ్యం పోసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయంతోనే పార్టీ అధిష్టానం ఉంది. ఆయన కార్యకలాపాలను నిశితంగా గమనిస్తోంది. ఈ అసమ్మతి తారాస్థాయికి చేరుకోకుండా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ అధిష్టానం డి. శ్రీనివాస్ తోనూ రోశయ్యతోనూ మాట్లాడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications