హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం బెంగుళూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం ఆయన ఇటీవల బెంగుళుర్ వెళ్లారు. జగన్ కు షంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రులు వట్టి వసంతకుమార్, బాలరాజు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) కార్యదర్శి అంబటి రాంబాబు స్వాగతం పలికారు. వారు జగన్ తో ఆయన ఉంటున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.
జగన్ ను సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస రెడ్డి, శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి, సినీ దర్శుకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు కలుసుకున్నారు.