రాష్ట్రంలో వరద తాకిడి మండలాలు 96

Flood Areas
హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 96 మండలాలను ప్రభుత్వం వరద తాకిడి ప్రాంతాలుగా ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 38, గుంటూరు జిల్లాలో 20, మహబూబ్ నగర్ జిల్లాలో 15, నల్లగొండ జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 16 మండలాలను ప్రభుత్వం వరద తాకిడి ప్రాంతాలుగా గుర్తించింది. ఇటీవల ఈ జిల్లాలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదలకు ఈ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

ఇదిలా ఉంటే, కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ బృందం వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ప్రతినిధులు బుధవారం కృష్ణా జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించింది. ఆరుగురు సభ్యుల బృందం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+