హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను పలువురు మంత్రులు మంగళవారం విడివిడిగా కలిశారు. జగన్ తో వారు విడి విడిగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ తో భేటీ అయ్యారు.
కడప, అనంతపురం జిల్లాల శాసనసభ్యులు, మంత్రులు కూడా జగన్ ను కలిశారు. కడప, అనంతపురం జిల్లాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు కూడా జగన్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చలు జరిపారు.