చిత్తూరు: తాజాగా మరో కోర్టు ఫీజుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఈ కుంభకోణం బయిటపడింది. చలానాలో అంకెలను టాంపరింగ్ చేసి అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. అసలు మొత్తానికి బదులు తక్కువ మొత్తంలో చెల్లించి మిగితా మొత్తాన్ని తినేసినట్లు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం గత ఐదు సంవత్సరాలు సాగుతోందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిజానిజాలను బయటికి తీసేందుకు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.