మెదక్: మెదక్ జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ లో గురువారం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఓ ఇంట్లోకి ప్రవేశించి అడ్డు వచ్చిన భార్యభర్తలను దారుణంగా నరికి చంపారు. పెద్ద మొత్తంలో నగదు, నగలు దోచుకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.