వైయస్ జగన్ ఢిల్లీ యాత్ర, ప్రాధాన్యత

శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ జగన్‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. వీరి సమావేశంలో ముఖ్యంగా పులివెందుల టిక్కెట్, తర్వాత కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని జగన్‌కు తగిన ప్రాధాన్యపై చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి సోనియా గాంధీ సిద్ధమైనా, ఆ పదవి తీసుకోడానికి జగన్ తటపటాయిస్తున్నారు. కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ పదవి కావాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. లేదంటే పులివెందుల అసెంబ్లీ టికెట్ తీసుకుని పిసిసి అధ్యక్ష పదవి తీసుకోవాలని వైయస్ జగన్ ఆశిస్తున్నారు. ఈ ఆప్షన్లపై సోనియా గాంధీ నేడు ఆయనకు ఏదో ఒకటి తేల్చుకోమని చెప్పే అవకాశముంది.












Click it and Unblock the Notifications