ఓబుళాపురం అక్రమాలు 10 వేల కోట్లు: బాబు

రాష్ట్రంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కార్యకలాపాలను నిలిపేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనుల వ్యవహారంలో రెడ్ గోల్డ్, ఆర్ఆర్ గ్లోబల్ పాత్రపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. భారీగా అక్రమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇంత అక్రమాలు జరుగుతుంటే ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు గనుల మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications