విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ రాసలీలల కేసు కీలక మలుపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న కనకదుర్గ గుడి ఉద్యోగులను పోలీసులు విచారించారు. వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే వారి ద్వారా ఇతరుల గురించి పోలీసులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది, ఈ విధంగా దుర్గగుడిలోరాసలీలల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. అటు పోలీసులు, ఇటు దుర్గగుడి అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై రాష్ట్ర స్థాయి అధికారు లు కూడా సీరియస్‌ గా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ సంఘటన గురించి దేవాదాయశాఖ మంత్రి కూడా ఆరాతీశారు. రాసలీలలకు పాల్పడిన ఉద్యోగులిద్దరినీ వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విచారించారు. వారిద్దరినీ పోలీసు స్టేషన్‌కు పిలిపించి జరిగిన సంఘటనపై ప్రాధమికంగా ఆరా తీశారు.

ఆ ఇద్దరు ఉద్యోగులు చెబుతున్న మాటలలో పొంత న కుదరకపోవడంతో మరోసారి విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణకు నియామకమైన దుర్గగుడిలో ఇద్దరు మహిళా అధికారులు కూడా తమ పరిధిలో విచారణ కొనసాగిస్తున్నారు. సంబంధిత ఉద్యోగులనుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. తొలుత సిసిటీవీ కెమెరాలలో సంఘటన రికార్డు అయిందా? లేదా? రికా ర్డు అయితే దానిని తొలగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులిద్దరినీ ఇంతవరకు పిలిపించి మాట్లాడలేదని తెలుస్తోంది. కొత్త ఈవో వచ్చిన తరువాత వారిద్దరినీ పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దేవాదాయ శాఖ మాజీ అధికారి ఒకరు దుర్గగుడిలో మొత్తం 18మందికి వివాహేతర సంబంధాలున్నట్లు బహిరంగ లేఖ రాసి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈలేఖను పత్రికలకు, ఎల్రక్టానిక్‌ మీడియాకు విడుదల చేయడంతో ఒక ఛానల్‌ ఈ లేఖను ప్రసారం చేసింది. దీనిపై దుర్గగుడిలో మహిళా అధికారులు, ఉద్యోగులు పోలీసు కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు లేఖరాసిన మాజీ అధికారిపైన, లేఖను ప్రసారం చేసిన టీవీ ఛానల్‌ ప్రతినిధులపైనా సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X